Actress Megha Akash : ‘లై’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మేఘా ఆకాశ్ త్వరలోనే పెళ్లి పీటలేక్కబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ హీరోయిన్.. సాయి విష్ణు అనే కుర్రాడితో ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆగస్టు 22న తన నిశ్చితార్థ వేడుక జరిగినట్లు చెప్పుకొచ్చింది.
Also Read : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘స్త్రీ 2’.. పది రోజుల్లోనే అన్ని వందల కోట్లా?
ఇదిలా ఉంటే మేఘా ఆకాశ్-సాయి విష్ణు తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తమ పెండ్లికి రావాల్సిందిగా కోరుతూ సూపర్ స్టార్ కు ఆహ్వానం అందజేశారు. తలైవాను కలిసిన ఫోటోలను మేఘా ఆకాష్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ హీరోయిన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వికటకవి, సహకుటుంబం వంటి సినిమాల్లో నటిస్తోంది.
View this post on Instagram