Actress Kareena Kapoor About Her Remunaration : సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే బాలీవుడ్లో హీరోయిన్లకు రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. వారు ఫార్మ్‌లో ఉన్నా లేకపోయినా.. సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా పారితోషికం విషయంలో డిమాండ్‌ను ఏ మాత్రం తగ్గించరు బాలీవుడ్ భామలు. అలాంటి వారిలో కరీనా కపూర్ కూడా ఒకరు. సైఫ్ అలీ ఖాన్‌తో పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది.
రీసెంట్ గానే ‘క్రూ’ మూవీతో హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…” దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ సంపాదిస్తున్న హీరోయిన్స్ లో నేను కూడా ఒకదాన్ని. ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించా.
Also Read : ‘తండేల్’ బడ్జెట్ అన్ని కోట్లా?.. చైతూతో వర్కౌట్ అవుతుందా..?
కేవలం పారితోషికాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు అంగీకరించను. పాత్ర నచ్చితే తక్కువ రెమ్యూనరేషన్‌కూ యాక్ట్ చేస్తా. అది పూర్తిగా నా అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. సినిమా ఎలాంటిది? అందులో నా పాత్ర ఏమిటి? అది సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటా” అని పేర్కొంది. దీంతో కరీనా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.