Actor Adivi Sesh Gives Surprise to His Little Fan : టాలీవుడ్ యంగ్ అండ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా, రైటర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరో త్వరలోనే ‘గూడచారి సీక్వెల్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో తాజాగా తన మంచి మనసును చాటుకున్నాడు.
సమాజానికి ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేసే అడవి శేష్ ఇటీవల క్యాన్సర్తో పోరాడుతున్న చిన్ని పాపతో రోజంతా సమయాన్ని గడిపారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ సన్నిహిత వ్యక్తి ద్వారా ఈ చిన్ని అభిమాని గురించి తెలుసుకున్న శేష్, త్వరగా ఆమె, కుటుంబ సభ్యులని సంప్రదించారు. ఆ చిన్నారితో వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజులకు రిప్లేయ్ ఇచ్చారు. అంతే కాదు చిన్నారి కోసం ఒక క్యూట్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.
#AdiviSesh‘s Heartwarming Act of Kindness ❤️
In an inspiring and touching gesture, Hit Machine @AdiviSesh recently reached out to surprise a little girl battling cancer, bringing joy to her.
His genuinly loving heart has left a lasting impact in both the little girl and her… pic.twitter.com/g8K5KTsyIu
— Shreyas Sriniwaas (@shreyasmedia) July 20, 2024
Also Read : కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకోవడంపై కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్!
ఒక ప్రముఖ హోటల్లో ఫ్యామిలీ కోసం డే అవుట్ ని ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలసి.. చిన్నారితో పాటు వాళ్ల కుటుంబాన్ని సర్ప్రైజ్ చేశారు. ఇక పాపతో రోజంతా సరదాగా ఆడుతూ గడిపారు. దీంతో పాటు ఆ చిన్నిపాప, ఆమె కుటుంబ సభ్యులతో ఎప్పుడూ సన్నిహితంగా ఉంటున్న శేష్, అవసరమైనప్పుడు తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం చిన్నారితో అడివి శేష్ ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్స్ అంతా అడివి శేష్ ‘రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.