Bigg Boss Telugu Season – 8 : టాలీవుడ్ (Tollywood) లో తనదైన కామెడీతో మంచి పేరు తెచ్చుకున్నయంగ్ యాక్టర్ అభినవ్ గోమటం (Abhinav Gomatam) తాజాగా బిగ్ బాస్ (Bigg Boss) తెలుగు 8వ సీజన్లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమటం.. ఆ తర్వాత ‘మస్తు షేడ్స్ ఉన్నాయి రా’, ‘మై డియర్ దొంగ’,కిస్మత్, సేవ్ ది టైగర్స్ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు.
దీని కంటే ముందు అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మెప్పించాడు. ప్రెజెంట్ కామెడీ రోల్స్ కు దూరమై సీరియస్ రోల్స్ చేస్తున్నాడు. తాజాగా బిగ్‌బాస్ టీమ్ అభినవ్ ను సంప్రదించినట్లు ఓ వార్త సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతుంది. అతను కనుక బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయితే హౌస్ లో అన్ లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అని నెటిజన్స్ అంటున్నారు.
Also Read : ‘కల్కి’ లో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్
కాగా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభినవ్ గోమటం బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అవుతారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు బిగ్ బాస్ సీజన్- 8 సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ప్రోమోలు విడుదలై మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.