Old Couple Marriage Video Viral : మనిషి జీవితం(Human Life) లో పెళ్లి(Marriage) అనేది ఎంత ముఖ్య ఘట్టమో తెలిసిందే. సాధారణంగా ప్రతీ ఒక్కరూ యుక్త వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటారు. 30, 40 లలో పెళ్లి చేసుకోవడం అరుదుగా చూస్తుంటాం. కానీ వృద్ధులు పెళ్లి చేసుకోవడం ఎక్కడా చూసుండం.
వృద్ధుడు యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు ఇతర దేశాలు, రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ తాజాగా మన తెలంగాణా రాష్ట్రం(Telangana State) లో ఓ ఇద్దరు వృద్దులు 80 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే…
మహబూబాబాద్ జిలాల్లో వృద్దుల పెళ్లి
వృద్ధులు పెళ్లి చేసుకున్న ఘటన మహబూబాబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నెల్లికుదురు మండలం వస్రాం తండాకు చెందిన 80 ఏళ్ళ సమిడా నాయక్ 75 ఏళ్ళ గుగులోత్ లాలమ్మను పెళ్లి చేసుకున్నాడు. నిజానికి ఈ ఇద్దరూ 70 ఏళ్ళ క్రిందటే గంధర్వ వివాహం చేసుకున్నారు. వీళ్ళకి నలుగురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.
అయితే అప్పట్లో గంధర్వ వివాహం చేసుకున్న ఈ దంపతులకు వారి సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేయాలనీ వాళ్ళ మనవళ్లు, మనవరాళ్ళు నిర్ణయించారు. ఈ మేరకు మనవడు యాకుబ్ పుట్టినరోజు సందర్భంగా తాతయ్య, నానమ్మలకు పెళ్లి జరిపించారు. ఈ వృద్ధ దంపతుల పెళ్లి చూసేందుకు చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media) మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు
మహబూబాబాద్ – నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో గుగులోతు లాలమ్మ(75), సమిడా నాయక్(80) దంపతులు 80 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు.
70 సంవత్సరాల క్రితం గంధర్వ వివాహం చేసుకున్న వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.… pic.twitter.com/dVELpv1Eld
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2024
Also Read : వీడెంత వెధవ అంటే.. భార్యను చంపి.. సెక్స్ డాల్ కొన్నాడు