Urvashi Rautela : ఇండియా నుంచి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లిన సెలెబ్రిటీస్ లో ఊర్వశి రౌతేలా ఒకరు. రీసెంట్ గా జరిగిన 77 వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై ఖరీదైన డ్రెస్సులు ధరించి తనదైన అందంతో ఆకర్షించింది. ఈ క్రమంలోనే పింక్ డ్రెస్ లో మెరుస్తూ అబ్బురపరిచింది. కేన్స్ వేదికపై మొదటి రోజు ఊర్వశి ఈ పింక్ గౌన్ ను ధరించింది.
తాజాగా ఈ గౌన్ ధర కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఊర్వశి రౌతేలా వేసుకున్న ఈ పింక్ గౌన్ ఖరీదే 47 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ తరువాత నాల్గవ రోజు ధరించిన బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు అని చెబుతున్నారు. అంటే ఈ రెండు డ్రెస్సులు కలిపి ఏకంగా 105 కోట్లు ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
ఈ విషయం తెలిసి నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఈ రెండు డ్రెస్సులకే 105 కోట్లు అంటే.. ఆమె డైలీ యూజ్ చేసే కాస్ట్యూమ్స్, ఇళ్ళు, కార్లు.. ఇవన్నీ కలిపి ఎన్ని కోట్లు ఉంటుందో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఊర్వశీ రౌతేలా విషయానికొస్తే..వాల్తేరు వీరయ్య, బ్రో, ఏజెంట్, స్కంద వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది. ప్రస్తుతం బాలయ్య – బాబీ కాంబోలో తెరకెక్కుతున్న ‘NBK109’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తోంది.