Telangana : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఆరేళ్ల బాలిక (6 Years Old Girl) పై అత్యాచారం (Rape) చేసి హత్య (Killed) చేశాడు ఓ కీచకుడు. నిందితుడు బీహార్ (Bihar) కు చెందిన బలరాంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో జరిగిన ఈ ఘటన అందరిని కలచివేసింది.
ఆరేళ్ల బాలిక అని చూడకుండా విచక్షణ కోల్పోయి ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు ఆ కీచకుడు. ఆ చిన్నారి బతికి ఉంటే ఎక్కడ విషయం తెలిసిపోతుందనే భయంతో దారుణంగా చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురు.. నిర్జీవంగా పడి ఉండడం చూసిన తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. వెంటనే ఆ నిందితుడిని కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి!
బ్రేకింగ్ న్యూస్
పెద్దపల్లిలో దారుణం
ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు
పెద్దపల్లి – నిన్న రాత్రి ఓ రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తరప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు.
సమీప పొదల్లోకి తీసుకెళ్లి… pic.twitter.com/V7wl8OuV4v
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024