3rd Marriage For Her Husband : భర్తకు (Husband) ఇద్దరు భార్యలు (Wife’s) కలిసి ఘనంగా పెళ్లి చేసిన సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఇంటింటికి శుభలేఖలు పంచి, బంధువులు, సన్నిహితులను పిలిచి, విందు భోజనాలు పెట్టించి మరీ పెళ్లి వేడుకను అంగరంగవైభవంగా జరిపించారు. ఈ విచిత్ర ఘటన ఏపీలోని అల్లూరి జిల్లా (Alluri District) లో జరగగా మూడుపెళ్లిళ్ల ముద్దుల మొగుడి వివరాలు ఇలా ఉన్నాయి.
సంతానం కాకపోవడంతో ఇద్దరు భార్యలు కలిసి..
అల్లూరి జిల్లా కించూరు గ్రామానికి చెందిన పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో ఫస్ట్ మ్యారేజ్ జరిగింది. అయితే ఆమెకు పిల్లలు పుట్టట్లేదనే నెపంతో అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు పండన్న. వీరికి 2007లో ఓ బాబు పుట్టాడు. అయితే రెండో భార్యకు రెండో సంతానం కాకపోవడంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లి (Marriage) చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో పండన్న కొంతకాలంగా ఇష్టపడుతున్న కిల్లంకోట గ్రామానికి చెందిన లక్ష్మిని ఇచ్చి పెళ్లి జరిపించారు. తల్లిదండ్రులు లేని పండన్నకు ఆ ఇద్దరు భార్యలే పెళ్లి పెద్దగా వ్యవహిరించి పెళ్లి చేయడం చర్చనీయాంశమైంది.
పెళ్లి శుభలేఖలో వారి పేర్లే వేసి అందరినీ ఆహ్వానించిన పండన్న భార్యలు..’మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తూ.. నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన. ఆహ్వానితులు సాగేని పార్వతమ్మ, సాగేని అప్పలమ్మ’ అంటూ అతిథులను ఆహ్వానించి జూన్ 25న కించూరులో వివాహం జరిపించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా ఫన్నీగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
Also Read : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఈ వారం ఏకంగా 24 సినిమాలు రిలీజ్..!