Breaking: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కల్పనా సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వైఎస్సాఆర్ ఫ్లైఓవర్ నుంచి కల్పనా సెంటర్ మీదుగా వస్తున్న కారు..బైక్ ను అతి వేగంతో ఢీకొట్టడం వల్ల సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా…ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు.
ఈ ప్రమాదం మద్యం మైకంలో జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read: మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి!