Harare: జింబాబ్వేతో జరిగిన మొదటి టీ20లో భారత్ కు ఘోర పరాభవం ఎదురైంది. 5 టీ20 సిరీస్‌లో భాగంగా హరారె వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియాను 13 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది.
View this post on Instagram
భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (31) టాప్ స్కోరర్ గా నిలవగా.. చివర్లో వాషింగ్టన్ సుందర్ (27) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. చటార (3/16), సికిందర్ రజా (3/25) భారత్‌ను దెబ్బకొట్టారు. బెన్నెట్, మసకద్జా, జాంగ్వి, ముజరబాని తలో వికెట్ పడగొట్టారు. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ డకౌట్ కాగా, గైక్వాడ్ 7 పరుగులకు అవుట్ అయ్యాడు. అలాగే రియాన్ పరాగ్ 2 పరుగులకు అవుట్ కాగా రింకు సింగ్ కూడా రెండు బంతులకు డకౌట్ అయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా 3, చటారా 2, బెన్నెట్, మసకడ్జా, ముజారబని, జోగ్వే లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.