ఒంటరి మహిళలే టార్గెట్ గా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇటీవలే ఇంట్లో నిద్రిస్తున్న ఓ వివాహితను ఐదుగురు వ్యక్తులు కలిసి అత్యాచారం చేసిన సంఘటన మరవకముందే మరో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న 19 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు లేని సమయంలో ఆమెను ఇంటికి ఆహ్వానించి నమ్మించి మోసం చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) ఉద్యోగుల క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది.
Also read :ఆ అనుమానంతో భార్యను సజీవదహనం చేసిన దుర్మార్గుడు
ఈ మేరకు ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి తండ్రి బార్క్‌లో ఉద్యోగి. ఓ నిందితుడి (26) తండ్రి కూడా అదే సంస్థలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా వారిద్దరూ ఒకే భవనంలోని వేర్వేరు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే వారి పిల్లలకు పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో బుధవారం రాత్రి నిందితుడి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడంతో అతడు తన స్నేహితుడిని (30) ఇంటికి పిలిపించుకున్నాడు. వంట చేసుకునేందుకు బాధితురాలిని ఇండక్షన్ స్టవ్ అడిగాడు. అయితే తమకున్న పరిచయంతో కాదనలేకపోయిన ఆమె నమ్మకంతో దానిని తీసుకెళ్లింది. అయితే ఆ యువతిని మాటల్లో పెట్టి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌ను ఇచ్చారు. దాన్ని తాగి స్పృహ కోల్పోయిన విద్యార్థినిపై ఆ యువకులిద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం తెల్లవారుజామున స్పృహలోకి వచ్చిన అమ్మాయి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో చెంబూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించిన పోలీసులు ఇందుకు సంబధించిన పూర్తి వివరాలకోసం ఇద్దరి యువకులను విచారిస్తున్నట్లు తెలిపారు.
https://www.youtube.com/watch?v=__oE9p9TIo8