Samantha Attends Akkineni Family Event : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉంది. మరికొద్ది రోజుల్లో తిరిగి మూవీ షూటింగ్స్ తో బిజీ కానుంది. అక్కినేని నాగ చైతన్యను (Naga Chaitanya) ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్.. వ్యక్తిగత కారణాలతో 2021లో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే అక్కినేని ఫ్యామిలీ లో ఓ ఈవెంట్ జరగబోతుంది. ఇక ఈ ఈవెంట్ కి సామ్ వెళ్తుందా? లేదా? అనే దానిపై నెట్టింట ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తోంది.
అక్కినేని ఫ్యామిలీ ఈవెంట్ కి సమంత
అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ సినిమా (Manam Movie) ఎంత స్పెషలో తెలిసిందే. విక్రమ్ కె.కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అక్కినేని ఫ్యామిలీ అంత నటించారు. ముఖ్యంగా నాగేశ్వరరావు కనిపించిన చివరి సినిమా కూడా ఇదే. సమంత కూడా ఇందులో చైతూకి జోడిగా నటించింది. అయితే ఈ సినిమా రిలీజై 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా మళ్ళీ థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు.
Also Read : ఫోన్ చేసి మరీ ఆ పనికి రమ్మంటారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
దాంతో పాటూ ఓ స్పెషల్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ ఈ ఈవెంట్ కి సమంతను పిలుస్తారా?అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ ఈవెంట్ కోసం సమంత కి అక్కినేని ఫ్యామిలీ నుంచి పిలుపొస్తే సామ్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వాళ్లిదరు కలిస్తే చూడాలని కోరుకునే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు. మరి ఈ ఈవెంట్ కి సమంతను ఇన్వైట్ చేస్తారా? లేదా?అనేది చూడాలి.