Hasseen Dillruba: నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ 'దిల్‌రుబా'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

తాప్సీ, విక్రాంత్‌ మాస్సే జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా'. ‘హసీన్‌ దిల్‌రుబా’ సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు గ్లింప్స్‌ విడుదల చేశారు.

Hasseen Dillruba: నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ 'దిల్‌రుబా'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?
New Update

Phir Aayi Hasseen Dillruba Movie OTT: 2012లో ఓటీటీలో విడుదలైన తాప్సీ పన్ను (Taapsee Pannu), విక్రాంత్ మాస్సేల 'హసీన్ దిల్రుబా' (Haseen Dillruba) సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా 'ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రూబా' రాబోతుంది. ఇందులో మరోసారి తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సీ జంటగా కనిపించనున్నారు. ప్రేమ, ద్రోహం, క్రైమ్ వంటి హృదయ విదారకమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సీక్వెల్ కు జైప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాణిగా తాప్సీ, రిషబ్‌గా విక్రమ్‌ నటించారు.

'ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రూబా' రిలీజ్

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 'ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రూబా' ఆగస్టు 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో (Netflix) స్ట్రీమింగ్ కానున్నట్లు గ్లింప్స్‌ విడుదల చేశారు. ఈ వీడియోను నెట్ ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ చిత్రంలో సన్నీ కౌశల్ , జిమ్మీ షెర్గిల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

9 August ki Hasseen shaam, Dillruba ke naam 🌹

Phir Aayi Hasseen Dillruba, is out on 9 August, only on Netflix ❤️‍🔥#PhirAayiHasseenDillrubaOnNetflix pic.twitter.com/pLqfLFR2R1

— Netflix India (@NetflixIndia) July 15, 2024

Also Read: Tamannaah Bhatia: అంబానీ పెళ్ళి వేడుకలో అందాలతో కేక పెట్టించిన మిల్కీ బ్యూటీ..! - Rtvlive.com

#taapsee-pannu #phir-aayi-hasseen-dillruba
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe