T20 World Cup : కోహ్లీ గురించి తప్పుగా అంచన వేస్తున్నారు.. మాజీలకు టామ్‌ మూడీ చురకలు!

కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మాజీ కోచ్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కోహ్లీని చాలామంది తప్పుగా అంచనా వేస్తున్నారు. ఓవర్‌కు కనీసం 9 నుంచి 11 పరుగులు అనుభవం, సత్తా అతని సొంతం. మంచి ప్రదర్శనను తప్పకుండా చూస్తాం' అన్నాడు.

T20 World Cup : కోహ్లీ గురించి తప్పుగా అంచన వేస్తున్నారు.. మాజీలకు టామ్‌ మూడీ చురకలు!
New Update

Tom Moody : టీ20 వరల్డ్ కప్ 2024(T20 World Cup 2024) జట్టులో స్థాన దక్కించుకున్న కోహ్లీ(Virat Kohli) స్ట్రైక్‌రేట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో మాజీ కోచ్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత మాజీ ఆటగాడు శ్రీశాంత్.. విరాట్ మూడో స్థానంలో వచ్చి ‘యాంకర్‌’ పాత్ర పోషిస్తాడని వ్యాఖ్యానించగా.. అసలు అలాంటి పదమే పొట్టి ఫార్మాట్‌లో లేదని మూడీ అన్నాడు. ప్రతి ఒక్కరు దూకుడుగా ఆడాల్సిందేనని చెప్పాడు.

Also Read : ఈక్వేడర్‌ బ్యూటీ క్వీన్ హత్య.. కారణం ఇదే

‘కోహ్లీని చాలామంది తప్పుగా అంచనా వేస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో విరాట్ వాటిని పక్కన పెట్టేయాలి. అతడి బ్యాటింగ్‌లో చాలా గేర్లు ఉంటాయి. ఓవర్‌కు కనీసం 9 నుంచి 11 పరుగులు చేయగల అనుభవముంది. రన్‌రేట్‌ను కొనసాగించగల సత్తా ఉన్నోడు విరాట్. ఐపీఎల్‌ 2024(IPL 2024) సీజన్‌లో చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఓపెనర్‌గా వచ్చి హాఫ్ సెంచరీలతో అలరించాడు. ఈ ప్రపంచకప్‌లోనూ అతని నుంచి మంచి ప్రదర్శనను తప్పకుండా చూస్తాం' అన్నాడు.

#kohli #2024-t20-world-cup #tom-moody
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe