IND Vs PAK: 2024 టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం దాయాదుల పోరు జరగనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్- పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇప్పటికే టీమ్‌ఇండియా ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఘనంగా బోణీ కొట్టగా పాకిస్థాన్ యూఎస్‌ఏ చేతిలో ఓటమితో టోర్నీని ఆరంభించింది. దీంతో రేపు జరగబోయే మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.
📸 𝗣𝗿𝗲𝗽𝘀 𝗜𝗻 𝗙𝘂𝗹𝗹 𝗦𝘄𝗶𝗻𝗴!👌 👌#TeamIndia gearing up for the #INDvPAK clash in New York 👍 👍#T20WorldCup pic.twitter.com/V9Q3qjsFEa
— BCCI (@BCCI) June 8, 2024
ఇక ఇప్పటివరకు ఏడుసార్లు జరిగిన పొట్టి కప్‌లో రెండు జట్లు తలపడగా.. ఆరింట్లో భారత్ గెలిచింది. ఒకదాంట్లోనే పాక్‌ను విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటికే ఐర్లాండ్‌ను ఓడించిన భారత్ ఉత్సాహంగా ఉంది. మరోవైపు యూఎస్‌ఏ చేతిలో ఓడి నిరుత్సాహానికి గురైన పాక్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది.
భారత్ - పాక్ మ్యాచ్ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. న్యూయార్క్ వేదిక కావడంతో కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయని ఐసీసీ వెబ్‌సైట్ చూస్తే అర్థమవుతుంది. డైమండ్ క్లబ్ (10వేల డాలర్లు), కబానాస్ (3వేల డాలర్లు), కార్నర్ క్లబ్స్ (2,750 డాలర్లు), ప్రీమియమ్ క్లబ్ లాంజ్ (2,500 డాలర్లు), బౌండరీ క్లబ్ (1,500 డాలర్లు) కేటగిరీల్లో కొన్ని సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.