T20 Worl Cup 2024: ప్రపంచకప్ పోటీల్లో టీమిండియా సంచలనం.. పాకిస్థాన్ రికార్డ్ బ్రేక్!

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇంతకు ముందు పాకిస్థాన్.. బంగ్లాదేశ్ పై 6 సార్లు గెలిచింది. ఇప్పుడు టీమిండియా పాక్ పై ఏడుసార్లు గెలిచింది. 

T20 Worl Cup 2024: ప్రపంచకప్ పోటీల్లో టీమిండియా సంచలనం.. పాకిస్థాన్ రికార్డ్ బ్రేక్!
New Update

T20 Worl Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా సరికొత్త రికార్డ్ సృష్టించింది. అదికూడా పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డ్ ను బద్దలు కొట్టింది. తక్కువ స్కోరుకే ఆలౌట్ అయి.. అభిమానుల్లో ఆందోళన రేకెత్తించిన టీమిండియా.. బౌలింగ్.. ఫీల్డింగ్ లలో అద్భుత ప్రతిభ చూపించి పాకిస్థాన్ ను కట్టడి చేసి సంచలన విజయం నమోదు చేసింది. ఈ క్రమంలో ప్రపంచ కప్ టీ20 పోటీల్లో పాక్ రికార్డ్ ను బద్దలు కొట్టింది. 

ఇప్పటివరకూ టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ఒకే జట్టుపై అత్యధికంగా ఏడు విజయాలు సాధించిన టీమ్ గా టీమిండియా సంచలనం సృష్టించింది. పాకిస్థాన్ పేరిటి ఉన్న ఈ రికార్డ్ ను బద్దలు కొట్టింది భారత్ జట్టు. బంగ్లాదేశ్ పై 6 మ్యాచ్ లు గెలిచిన రికార్డ్ పాకిస్థాన్ కు ఉంది. ఇప్పుడు భారత్ వరుసగా ఏడో మ్యాచ్ లో పాకిస్థాన్ పై విజయం సాధించడం ద్వారా ఆ రికార్డ్ ను చెరిపివేసింది. 

T20 World Cup 2024 team india

T20 Worl Cup 2024:న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు.

ఓపెనర్ విరాట్ కోహ్లి (4) తొందరగానే నిష్క్రమించగా, రోహిత్ శర్మ 13 పరుగుల వద్ద ఔటయ్యాడు. 3వ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఫలితంగా భారత జట్టు 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది.

T20 World Cup 2024 Pakistan

1T20 Worl Cup 2024: 20 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్థాన్ జట్టుకు శుభారంభం లభించింది. 11 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. ఈ దశలో హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా తమ అద్భుత బౌలింగ్ తో మ్యాచ్‌ మొత్తాన్ని మార్చేశారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో బుమ్రా కమల్ చేశాడు. దీంతో పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమ్ ఇండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు రికార్డును బద్దలు కొట్టడం కూడా విశేషం.

T20 World Cup 2024

T20 Worl Cup 2024: ఇంతవరకూ టీ20 ప్రపంచకప్‌లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన రికార్డు పాకిస్థాన్ జట్టు పేరిట ఉంది. బంగ్లాదేశ్‌పై పాక్ జట్టు 6 సార్లు గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పుడు పాక్ జట్టును ఓడించి టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టు 7 సార్లు విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా ప్రపంచ రికార్డును ఖాయం చేసుకుంది. మొత్తంగా తక్కువ స్కోరింగ్ మ్యాచ్ లో గెలుపు కష్టం అనుకున్నప్పటికీ.. సమిష్టి కృషితో పాకిస్థాన్ పై గెలిచి రికార్డ్ సృష్టించడంతో టీమిండియా అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. 

#t20-world-cup-2024 #cricket #teamindia
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe