SCR : రైలు ప్రయాణికులకు తీపి కబురు... అక్కడ రద్దైన రైళ్ల పునరుద్ధరణ

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు ఓ శుభవార్త చెప్పింది. గతంలో విజయవాడ మార్గంలో ప్రయాణించిన పలు రైళ్లను రైల్వే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రైళ్లను తిరిగి పునరుద్ధరించింది.

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!
New Update

South Central Railway : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు ఓ శుభవార్త చెప్పింది. గతంలో విజయవాడ (Vijayawada) మార్గంలో ప్రయాణించిన పలు రైళ్లను రైల్వే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రైళ్లను తిరిగి పునరుద్ధరించింది. ఈ రైళ్ల వివరాలు తెలుసుకోండి. రైలు నెంబర్ 17258 కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడకు అందుబాటులో కి రానుంది. ఈ రైలు కాకినాడ పోర్టు (Kakinada Port) లో ఉదయం 4.10 గంటలకు బయల్దేరితే ఉదయం 9.30 గంటలకు విజయవాడ కు చేరుతుంది.

రైలు నెంబర్ 07500 విజయవాడ నుంచి గూడూరుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు (Train) విజయవాడలో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరితే అర్ధరాత్రి 12.40 గంటలకు గూడూరుకు చేరుతుంది. రైలు నెంబర్ 07876 తెనాలి నుంచి రేపల్లె వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలి లో సాయంత్రం 4.40 గంటలకు బయల్దేరితే సాయంత్రం 5.40 గంటలకు రేపల్లెకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07787 రేపల్లె నుంచి గుంటూరుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రేపల్లెలో సాయంత్రం 6 గంటలకు బయల్దేరితే రాత్రి 7.55 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07458 గూడూరు నుంచి విజయవాడ వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ రైలు గూడూరులో ఉదయం 6.10 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 3.45 గంటలకు విజయవాడ వస్తుంది. రైలు నెంబర్ 07781 విజయవాడ నుంచి మాచర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడలో సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరితే రాత్రి 9.35 గంటలకు మాచర్లకు చేరుతుంది. రైలు నెంబర్ 07782 మాచర్ల నుంచి విజయవాడకు ఉంటుంది. ఈ రైలు మాచర్లలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరితే ఉదయం 10.55 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07629 విజయవాడ నుంచి తెనాలికి ఉంటుంది.

ఈ రైలు విజయవాడలో ఉదయం 11.15 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 12.20 గంటలకు తెనాలికి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07874 తెనాలి నుంచి రేపల్లెకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 3.20 గంటలకు రేపల్లెకు చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07873 రేపల్లె నుంచి తెనాలికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రేపల్లెలో తెల్లవారుజామున మధ్యాహ్నం 1.10 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 2.10 గంటలకు తెనాలికి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07630 తెనాలి నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 2.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07875 రేపల్లె నుంచి తెనాలికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రేపల్లెలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరితే సాయంత్రం 4.30 గంటలకు తెనాలి (Tenali) కి చేరుకుంటుంది.

Also read: ఏపీలో దారుణం…వైన్‌ షాపు దగ్గర గొడవ..ఒకరి హత్య!

#vijayawada #trains #south-central-railway
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe