Sweating: అరచేతిలో చెమటలు పడితే అది దేనికి సంకేతం..ఈ అనారోగ్యాలు తప్పవా?

అరచేతులు తరచుగా చెమటలు పట్టడం కాలేయ సమస్యతోపాటు ఫ్యాటీ లివర్‌కు సంకేతం. ఈ సమస్య కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ఉప్పు, వ్యాయామం మంచి డైట్ కంట్రోల్ చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు.

New Update
Sweating: అరచేతిలో చెమటలు పడితే అది దేనికి సంకేతం..ఈ అనారోగ్యాలు తప్పవా?

Sweating: అరచేతులు తరచుగా చెమటలు పట్టడం కాలేయ సమస్యకు సంకేతమని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే మీరు అజీర్ణం, కడుపులో గ్యాస్ ఎక్కువగా ఏర్పడటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మర్చిపోవద్దు. కొన్నిసార్లు అరచేతులు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చెమటలు పడతాయి. చలికాలంలో కూడా ఈ సమస్య ఎదురైతే తేలిగ్గా తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు.

కాలేయ సమస్యలకు సంకేతమా?

  • అరచేతులు తరచుగా చెమటలు పట్టడం కాలేయ సమస్యకు సంకేతమని, ఈ సమస్య కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలంటున్నారు. ఫ్యాటీ లివర్ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా సులభంగా నయం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ అరచేతులు చెమటలు పట్టడం ఫ్యాటీ లివర్‌కు సంకేతం. అయితే ఈ లక్షణాలు అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండవని, కొన్ని సందర్భాల్లో అరచేతులపై సేబాషియస్ గ్రంథులు ఉండటం వల్ల కూడా చెమట ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఫ్యాటీ లివర్‌ ప్రమాదమా?

  • ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ అనేది సర్వసాధారణమైన వ్యాధిగా మారిందని, ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు. ఫ్యాటీ లివర్‌ సమస్య త్వరగానే చికిత్సతో నయం అవుతుంది. కానీ చికిత్స చేయకుండా వదిలేస్తే అది లివర్ సిర్రోసిస్ మరియు కాలేయ వైఫల్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

డైట్‌ కంట్రోల్‌ చేయడం వల్ల లాభం ఉంటుందా?

  • డైట్ కంట్రోల్ చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. ముందుగా ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించాలని, రోజువారీ వ్యాయామం కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు. అంతేకాకుండా వీలైనంత వరకు ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలంటున్నారు. అయితే అజీర్ణం, గ్యాస్ సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  పిల్లలు తినేటప్పుడు టీవీ పెడుతున్నారా?..ఈ తప్పు అస్సలు చేయకండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు