చంద్రున్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి....శివ శక్తిని దానికి రాజధానిగా ప్రకటించాలి....!

చంద్రున్ని ‘హిందూ రాష్ట్రం’గా ప్రకటించి దానికి శివ శక్తిని రాజధాని చేయాలని అఖిల భారతీయ హిందూ మహా సభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి అన్నారు. రేదైనా ఇతర భావజాలానికి చెందిన వ్యక్తులు చంద్రుని ఉఫరితలంపై జిహాద్ చేయడానికన్నా ముందే ఆ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

author-image
By G Ramu
చంద్రున్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి....శివ శక్తిని దానికి రాజధానిగా ప్రకటించాలి....!
New Update

అఖిల భారతీయ హిందూ మహా సభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రున్ని ‘హిందూ రాష్ట్రం’గా ప్రకటించి దానికి శివ శక్తిని రాజధాని చేయాలని ఆయన అన్నారు. మరేదైనా ఇతర భావజాలానికి చెందిన వ్యక్తులు చంద్రుని ఉఫరితలంపై జిహాద్ చేయడానికన్నా ముందే ఆ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఇతర సిద్దాంతాలు గల వ్యక్తులు చంద్రునిపైకి వెళ్లి అక్కడ జిహాద్ చేసి ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే కన్నా ముందే కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవాలని కోరారు. చంద్రున్ని ఇతర సిద్దాంతాల వాళ్లు గజ్వా- ఇ- హిందూగా మార్చడానికన్నా ముందే పార్లమెంట్ లో ఓ తీర్మానాన్ని ఆమోదించి చంద్రున్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు..

చంద్రుడు శివుని తలపై ఉంటాడని ఆయన అన్నారు. చంద్రున్ని మనమంతా చందమామ అని పిలుస్తామన్నారు. అందుకే చంద్రుడు స్వచ్ఛంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. అందుకే చంద్రున్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని తాము కోరుకుంటున్నామని వివరించారు. దీనిపై పార్లమెంట్, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు చేయాలని ఆయన కోరారు.

అగస్టు 23న చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై సేఫ్ ల్యాండ్ అయింది. దీంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం చంద్రునిపై అటు ఇటు తిరుగుతోంది. తాజాగా చంద్రునిపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన వివరాలను ఇస్రోకు అందజేసింది. ఆ వివరాలను ఇస్రో ట్వీట్ చేసింది.

చంద్రయాన్-3 విజయంపై ప్రధాని మోడీ అగస్టు 26న మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ఆయన అభినందించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ అయిన ప్రాంతానికి శివశక్తిగా ప్రధాని మోడీ నామకరణం చేశారు. దీంతో పాటు ప్రజ్ఞాన్ రోవర్ సంచరించే ప్రాంతాన్ని తిరంగా ప్రాంతంగా పిలవాలన్నారు. చంద్రయాన్-3 సక్సెస్ అయిన అగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

#pm-modi #isro #chandraya-3 #shiva-shakthi #hindu-rastra #swamy-chkrapani
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe