AP : ముచ్చుమర్రి వాసి అనుమానాస్పద మృతి.. బాలికపై హత్యాచారం కేసులో..

నంద్యాలలో యోహాను(35) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు ముచ్చుమర్రి వాసిగా గుర్తించారు. ముచ్చుమర్రి బాలికపై అత్యాచారం, హత్య కేసులో యోహానును పోలీసులు విచారించినట్టు సమాచారం. అతడి మృతదేహంపై గాయాలు ఉండడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

New Update
AP : ముచ్చుమర్రి వాసి అనుమానాస్పద మృతి.. బాలికపై హత్యాచారం కేసులో..

Nandyal : నంద్యాలలో యోహాను(35) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు ముచ్చుమర్రి (Muchumarri) వాసిగా గుర్తించారు అధికారులు. అయితే, ఏపీ (Andhra Pradesh) లో సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలికపై అత్యాచారం, హత్య కేసులో యోహానును పోలీసులు విచారించినట్టు సమాచారం.

యోహాను ఆత్యహత్య చేసుకున్నారా.. ఇంకా ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, యోహాను మృతదేహంపై గాయాలు ఉండడంతో పోస్టుమార్టం కోసం మృతదేహంను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి (Nandyal Government Hospital) తరలించారు. సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధిలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా వారిపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది.

యోహాన్‌ ఎలా చనిపోయాడు? అసలేం జరిగింది? ఆత్మహత్య? ఇంకేమైనా జరిగిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే ముచ్చుమర్రి బాలిక మృతదేహం ఇంకా దొరకని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 9 నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్న ఫలితం కనిపించడం లేదు. 16 తేదిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరి మేనమామ యోహాన్‌ అని తెలుస్తోంది.

Also Read: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద.. గంటగంటకు పెరుగుతోన్న నీటిమట్టం..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు