Skill Development Case Updates: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం(Andhra Pradesh Government) సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వ సర్వీస్ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు లేకుండా విదేశాలకు వెళ్ళడంపై వారంలోగా వ్యక్తిగత వివరణ ఇవ్వాలని ప్రభుత్వం మొమో జారీ చేసింది. అయితే శ్రీనివాస్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించారంటూ పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, పెండ్యాల శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్సనల్ సెక్రటరీగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో నిధుల మళ్ళింపు శ్రీనివాస్ చేతులమిదుగానే జరిగిందని సీఐడీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా చంద్రబాబుకు ఐటీ నోటీసుల అంశంలో కూడా మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, విదేశాల్లో తలదాచుకున్న పెండ్యాల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ రంగంలోకి దిగింది. అవసరమైతే శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్ సహకారం కూడా తీసుకుంటామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. అవసరమైతే లుక్ ఔట్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో కేసులో విచారణను మరింత స్పీడ్ పెంచారు సీఐడీ అధికారులు. పెండ్యాల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అతను విదేశాల్లోకి వెళ్లడానికి కారణం కూడా ఇదేనని వారు భావిస్తున్నారు. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read:
Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన
Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్