AP: మదనపల్లి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు..!

మదనపల్లె ఫైల్స్ దగ్ధం ఘటనపై సర్కార్ సీరియస్ అయింది. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. గత RDO మురళి, ప్రస్తుత RDOగా పని చేస్తున్న హరిప్రసాద్‌, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేస్తూ రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
AP: మదనపల్లి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు..!

Madanapalle Fire Incident: ఏపీలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో పని చేసిన RDO మురళి, ప్రస్తుత RDOగా పని చేస్తున్న హరిప్రసాద్‌, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేస్తూ రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే ఈ ఘటనకు కారణామని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు పెద్దిరెడ్డి బ్యాచ్‌ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటికే పీఏలు శశి, తుకారం, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, అనుచరుడు బాబ్‌జాన్‌ ఇంట్లో తనిఖీలు చేసి కీలక ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పెద్దరెడ్డి అనుచురుడు బాబ్‌జాన్‌ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో అసలు నిజాలు బయటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Also Read: శ్రీశైలం దగ్గర కృష్ణమ్మ పరవళ్లు.. గేట్లు ఎత్తిన అధికారులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు