Telangana Cabinet Meet: తెలంగాణ కేబినెట్ సమావేశం ఈరోజు నిర్వహించాల్సి ఉంది. ఈమేరకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే, ఈరోజు ఈ సమావేశం ఉంటుందా? లేదా? అనే సందిగ్దత నెలకొంది. ఎందుకంటే, ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఇప్పుడు కేబినెట్ మీటింగ్ నిర్వహించడానికి అనుమతి ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకూ ఈసీ నుంచి పర్మిషన్ రాలేదు. అధికారులు ఇప్పుడు అనుమతి రావడం కష్టమనే అంటున్నారు. ఇప్పటికే కేబినెట్ భేటీ కోసం ఈసీ అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. అయినా.. ఇప్పటి వరకూ అనుమతి రాలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండడంతో ఏ అధికారిక నిర్ణయం తీసుకోవాలన్నా.. ఈసీ పర్మిషన్ తప్పనిసరి. ఇప్పుడు ఈసీ కనుక అనుమతి ఇవ్వకపోతే, అనధికారికంగా సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. అప్పటిలోగా ఈసీ అనుమతి ఇస్తుందా? లేదా? అనే ఉత్కంఠ పెరుగుతోంది. మొత్తమ్మీద ఎన్నికల కోడ్ నేపధ్యంలో క్యాబినెట్ భేటీ జరిగే అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana Cabinet Meet: తెలంగాణ కేబినెట్ మీట్ పై ఎన్నికల కోడ్ నీలినీడలు
తెలంగాణ కేబినెట్ మీట్ ఈరోజు సాయంత్రం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ఉండడంతో మీటింగ్ పర్మిషన్ కోసం ఈసీని కోరింది ప్రభుత్వం. కానీ, ఇప్పటివరకూ అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ మీటింగ్ ఉంటుందా? లేదా? అనే సందేహం నెలకొంది
Translate this News: