Chiranjeevi: చిరంజీవికి రాజ్య సభ సీటు...సుస్మిత ఏమన్నారంటే!

మెగాస్టార్‌ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్‌ వచ్చిందని జరుగుతున్న ప్రచారం పై ఆయన పెద్ద కుమార్తె సుస్మిత స్పందించారు.ప్రస్తుతానికి తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌ మూడ్‌ లో ఉన్నట్లు.. గతంలోనూ ఇలాంటి ప్రచారమే జరగ్గా..రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చిరంజీవి చెప్పినట్లు ఆమె తెలిపారు.

Chiranjeevi: చిరంజీవికి రాజ్య సభ సీటు...సుస్మిత ఏమన్నారంటే!
New Update

Chiranjeevi Rajya Sabha Entry : మెగాస్టార్‌ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్‌ వచ్చిందని జరుగుతున్న ప్రచారం పై ఆయన పెద్ద కుమార్తె సుస్మిత (Sushmita Konidela) స్పందించారు. తాను నిర్మించిన పరువు వెబ్‌ సిరీస్ ప్రచారంలో భాగంగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన పరిధిలో లేని అంశాల గురించి అడుగుతున్నారన్నారు.

ఈ రూమర్స్‌ వచ్చాయని, అయితే ప్రస్తుతానికి తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌ మూడ్‌ లో ఉన్నట్లు ఆమె వివరించారు. గతంలోనూ ఇలాంటి ప్రచారమే జరగ్గా..తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చిరంజీవి ఇంతకు ముందే స్పష్టం చేశారు. ఏపీలో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో చిరు పేరు మరోసారి తెర మీదకు వచ్చింది.

Also Read: రాష్ట్రంలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ (PM Modi), చిరంజీవి, రజనీకాంత్‌ హాజరైన సంగతి తెలిసిందే. ఆ వేదిక పై పవన్‌ (Pawan Kalyan) మోదీని చిరంజీవి వద్దకు తీసుకుని వెళ్లడం, ఇద్దరి చేతులు పట్టుకుని అభివాదం చేయడం స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలిచింది.

దీంతో చిరంజీవికి రాజ్యసభ సీటని మరోసారి రుమార్స్‌ తెరమీదకు వచ్చాయి. వాటికి చెక్‌ పెడుతూ..సుస్మిత సమాధానం తెలిపారు.

#chiranjeevi #rajyasabha-seat #susmitha-konidela
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe