Surya Grahanam: సూర్యగ్రహణం ఏప్రిల్ 8, 2024న సంభవించబోతోంది. ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం. శాస్త్రీయ దృక్కోణం నుంచి చూస్తే సూర్యగ్రహణం కేవలం ఖగోళ దృగ్విషయం, కానీ మతపరమైన దృక్కోణంలో ఇది శుభప్రదంగా పరిగణించబడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ కాలంలో మన చుట్టూ ఉన్న ప్రతిదీ ప్రభావితమవుతుంది. కొన్ని పనులు చేయకుండా ఉండాలి లాంటి నియమాలు ఉంటాయి. సూర్యగ్రహణానికి ముందు, సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 25న వచ్చింది. ఇది దేశంలో కనిపించలేదు. అందువల్ల దాని ప్రభావం కూడా పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ 8న ఏర్పడే సూర్యగ్రహణం దేశంలో కనిపిస్తుందా లేదా అనే ప్రశ్న ప్రజలలో మెదులుతోంది. ఇక ఈ గ్రహణంప్రభావం ఎలా ఉంటుంది? అది ఏ ప్రదేశాలలో కనిపిస్తుందో తెలుసుకుందాం..!
ఏ సమయంలో గ్రహణం ఉంటుంది?
ఏప్రిల్ 8 సోమవారం నాడు ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9 తెల్లవారుజామున 2:22 గంటలకు ముగుస్తుంది.
సంవత్సరంలో మొదటి గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, అరుబా, బెర్ముడా, కరేబియన్ నెదర్లాండ్స్, కొలంబియా, కోస్టా రికా, క్యూబా, డొమినికా, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్, జమైకా, నార్వే, పనామా, నికరాగ్వా, రష్యా, ప్యూర్టో రికో మార్టిన్ , స్పెయిన్, బహామాస్, యునైటెడ్ కింగ్‌డమ్, వెనిజులాతో సహా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల నుంచి కనిపిస్తుంది.
ఈ ఏడాది తొలి గ్రహణం భారత్‌లో కనిపించనుందా?
చంద్రగ్రహణం మాదిరిగానే, ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు.
సుతక్ కాలం భారతదేశంలో చెల్లుబాటు అవుతుందా లేదా?
దీని సూతక్ కాలం సూర్యగ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. గ్రహణం తర్వాత వరకు కొనసాగుతుంది, అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు.. అందువల్ల దాని సూతక్ కాలం కూడా ఇక్కడ చెల్లదు.
ఇది కూడా చదవండి: ఈ రాశుల వారికి ఆ రోజు కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా?