Kallakurichi: ఇప్పటికైనా వారిపై ఉక్కుపాదం మోపండి.. కల్తీ మద్యం ఘటనపై నటుడు సూర్య!

కళ్లకురిచి కల్తీ మద్యం ఘటనపై న‌టుడు సూర్య ఆందోళన వ్యక్తం చేశాడు. అమాయక ప్రజల మరణాలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయన్నాడు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి కల్తీ మద్యం వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని సూచించాడు.

New Update
Kallakurichi: ఇప్పటికైనా వారిపై ఉక్కుపాదం మోపండి.. కల్తీ మద్యం ఘటనపై నటుడు సూర్య!

Spurious liquor: తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లాలో కల్తీ మద్యం (Spurious liquor) ఘటనపై న‌టుడు సూర్య స్పందించారు. కల్లకురిచ్చి మరణాలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయన్నాడు. తుఫానులు, వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా జరగని విషాదం ఒక్క క‌ల్తీ మ‌ద్యంతో జ‌రిగడం బాధకరమన్నాడు. వంద మందికి పైగా ఇంకా ఆసుపత్రిలో ఉండటం ఆందోళనకలిగిస్తోందని, ప్రభుత్వం సత్వరమే స్పందించి భాదితుల‌కు అండ‌గా ఉండాలని కోరాడు. గతేడాది విల్లుపురం జిల్లాలో క‌ల్తీ మ‌ద్యం తాగి 22 మంది చనిపోయారని, అప్పుడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తించారు. కానీ ఆ ఘ‌ట‌న జ‌రిగిన ప‌క్క జిల్లాలోనే ఇప్పుడు 50కి పైగా ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి కల్తీ మద్యం వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని సూచించాడు.

ఇక కల్తీ మద్యం తాగి ఇప్పటివ‌ర‌కు 47 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 100 మంది ఆసుపత్రిపాలయ్యారు. ఇక అస్వస్థతకు గురైన వారు కళ్లకురిచి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు ప్రభుత్వ అధికారుల వైఫల్యంతో పాటు, పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు, నటీనటులు ఆరోపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు