/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-32-6.jpg)
Suriya's Kanguva First Single Fire Song Out : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం "కంగువ". ఈ సినిమా నుండి ఊహాగానాలకు తెరదించుతూ, మొదటి పాట "ఫైర్ సాంగ్" రిలీజ్ అయింది. సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటలో సూర్య యుద్ధ వీరుడిగా పాత్రలో కనిపించడంతో పాటు, పాట కూడా చాలా పవర్ ఫుల్ గా.. ఉత్సాహంగా సాగుతోంది.
దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్తగా ఈ పాటకు సంగీతం అందించగా, శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించారు. "ఆది జ్వాల.. అనంత జ్వాల.. వైర జ్వాల.. వీర జ్వాల.. దైవ జ్వాల.. దావాగ్ని జ్వాల.." అంటూ సాగే ఈ పాట, సినిమాపై ఒక్కసారిగా అంచనాలను మరింత పెంచేసింది.
ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.
Through the flames of destiny, let's find our inner tribal instincts🔥
Let's celebrate our #Kanguva's birthday with the #FireSong 🌋
A @ThisIsDSP Musical
Vocals by @anuragkulkarni_ @deepthisings
Lyrics by @Shreelyricist#HappyBirthdaySuriya… pic.twitter.com/lFFSHj3lVq— UV Creations (@UV_Creations) July 23, 2024
దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.