సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. అన్ని రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో వచ్చే మార్పులు ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాయి. భవిష్యత్తు సౌకర్యాల కోసం పరిశోధకులు ఇలా ఇంకా ఎన్నెన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌లో వైద్యులు ఓ రికార్డు సృష్టించారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను పూర్తి చేసి ఔరా అనిపించుకుంటున్నారు. ఇంతకి అదేంటో తెలుసా.. ఏకంగా ఓ వ్యక్తి కంటినే మార్చేసి ఈ ఘనత సాధించారు.
అంధత్వం, దృష్టి లోపాన్ని సరిచేసేందుకు కార్నియా మార్పిడి వంటివి చేస్తున్నప్పటికీ కూడా న్యూయార్క్ వైద్యులు విజయవంతంగా చేసిన ఈ శస్త్రచికిత్సపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. అంతేకాదు ఇలాంటిది చేయడం కూడా ప్రపంచంలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. అయితే మరి వాళ్లు అమర్చిన మరో కన్ను ద్వారా దృష్టి వస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హై వోల్టేజీ ఉన్న విద్యు్త్తు తీగలు తగలడంతో ఆరమ్ జేమ్స్ అనే ఓ వ్యక్తి ముఖం చాలావరకు కాలిపోయింది. దీంతో అతనిది ఒక కన్ను మొత్తం పోయింది.
Also Read: ఈరోజు వరల్డ్ సైన్స్ డే.. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా.. ?
దీంతో కుడి కంటి రెప్పతో పాటు దాన్ని సమూలంగా మారిస్తేనే అతని ముఖానికి కొత్తరూపు ఇచ్చినట్లు అవుతుంది.. న్యూయార్క్‌లోని లాంగోన్‌హెల్త్ ఆసుపత్రి వైద్యులు అనుకున్నారు. దీని ప్రకారమే మే నెలలో దాదాపు 21 గంటల సేపు అతనికి శస్త్రచికిత్స చేశారు. అయితే వాళ్లు అమర్చిన ఆ కొత్త కన్ను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లు.. తాము చేసిన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు తాజాగా ప్రకటించారు. జేమ్స్‌కి కన్ను మూసి.. తెరవడం సాధ్యం కాకపోయినా కూడా కంటిపై మాత్రం స్పర్శ తెలుస్తోందని తెలిపారు. దీంతో భవిష్యత్తులో ఈ శస్త్రచికిత్స ఎన్నో కొత్త మార్గాలకు బాటగా నిలుస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Also read: నా మూర్ఖత్వమే ఆయన్ను సీఎం చేసింది…జితన్ పై నితీశ్ కుమార్ వివాదస్పద వ్యాఖ్యలు..!!