Supreme Court: సేమ్ సెక్స్ వివాహాలపై.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతిఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంటుందని.. అందుకోసం ప్రభుత్వం కూడా స్వలింగ వివాహాలకు న్యాయపరమైన హోదా ఇవ్వాలంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

Supreme Court: సేమ్ సెక్స్ వివాహాలపై..  సుప్రీం కోర్టు సంచలన తీర్పు
New Update

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు సంచలన ప్రకటన చేసింది. ప్రతిఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంటుందని.. అందుకోసం ప్రభుత్వం కూడా స్వలింగ వివాహాలకు న్యాయపరమైన హోదా ఇవ్వాలంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోనే ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య ఉన్న బంధంలో శారీరకంగానే ఎమోషనల్ అంశాలు కూడా ఉంటాయని జస్టీస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. సేమ్ సెక్స్, గే వివాహాలకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని ఆదేశించించారు. అలాగే స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. హోమో సెక్సువాలిటీ కేవలం నగరాలు, ఉన్నతవర్గాలకు సంబంధించింది విషయం కాదని స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు అధికారాల విభజనకు అడ్డంకి కాదని పేర్కొన్నారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలన్న సీజేఐ.. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు.

క్వీర్ యూనియన్లలోని వ్యక్తుల హక్కులు, అర్హతలను నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే రేషన్ కార్డులలో కూడా క్వీర్ జంటలను కుటుంబంగా చేర్చడం, జాయింట్ బ్యాంక్ ఖాతా కోసం నామినేట్ చేసేందుకు అనుమతించడం, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన వాటి నుండి వచ్చే హక్కులు.. వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించాలని పేర్కొన్నారు. అలాగే ఈ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలించాలని తెలిపారు. అలాగే క్వీర్ కమ్యూనిటీకి వస్తువులు, సేవలను పొందడంలో ఎలాంటి వివక్ష లేదని నిర్ధారించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించారు. క్వీర్ హక్కుల గురించి ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్వీర్ కమ్యూనిటీ కోసం హాట్‌లైన్‌ని సృష్టించడం, హింసను ఎదుర్కొనే క్వీర్ జంటల కోసం సురక్షిత గృహాలను 'గరిమా గృహ్' ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఇంటర్-సెక్స్ పిల్లలు బలవంతంగా ఆపరేషన్‌లు చేయించుకోకుండా చూసుకోవాలని తెలిపారు. క్వీర్ జంటపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు పోలీసులు ప్రాథమిక విచారణ జరపాలని సూచించారు. లైంగిక ధోరణి ఆధారంగా ఆ జంటలను యూనియన్‌లోకి ప్రవేశించే హక్కును పరిమితం చేయలేమన్నారు.

భిన్నమైన లింగ సంబంధాలలో ఉన్న లింగమార్పిడి వ్యక్తులు వ్యక్తిగత చట్టాలతో సహా ప్రస్తుత చట్టాల ప్రకారం వివాహం చేసుకునే హక్కును కలిగి ఉంటారన్నారు. క్వీర్ జంటలతో పాటు అవివాహిత జంటలు కూడా బిడ్డను దత్తత తీసుకోవచ్చని తెలిపారు. భిన్న లింగ జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించట్లేదని సీజేఐ వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కుల వివాహాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి కోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని అధికార విభజన సిద్ధాంతం అడ్డుకోదని తెలిపారు. న్యాయస్థానం చట్టం చేయకపోయినప్పటికీ దానిని అర్థం చేసుకుని అమలు చేయగలదని పేర్కొన్నారు. స్వలింగ సంపర్కం, హోమో సెక్సువాలిటీ అనేది పట్టణ భావన కాదని.. సమాజంలోని ఉన్నత వర్గానికి మాత్రమే పరిమితం కాదని తెలిపారు. వివాహం స్థిరమైనదని, దాన్ని మార్చలేమని అనుకోవడం సరికాదన్నారు. ప్రత్యేక వివాహ చట్టాన్ని కొట్టివేస్తే.. అది దేశాన్ని స్వాతంత్య్ర పూర్వ యుగానికి తీసుకెళ్తుందంటూ వ్యాఖ్యానించారు. అయితే, ప్రత్యేక వివాహ చట్టం అవసరమా లేదా అనేది పార్లమెంట్‌ నిర్ణయిస్తుందని, దీని చట్టపరిధిలోకి కోర్టు వెళ్లాలనుకోవడం లేదని చెప్పారు.

ప్రత్యేక వివాహ చట్ట పాలనలో మార్పు అవసరమా లేదా అనేది పార్లమెంటు నిర్ణయించాలని సీజేఐ అన్నారు. ఈ న్యాయస్థానం శాసనసభ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడాలని తెలిపారు. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని సమానత్వం డిమాండ్ చేస్తుందని చెప్పారు. జీవిత భాగస్వామిని ఎన్నుకునే సామర్థ్యం.. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, స్వేచ్ఛ మూలానికి వెళ్తుతుందని చెప్పారు. ‘‘జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అనేది ఒకరి జీవిత గమనాన్ని ఎంచుకోవడంలో అంతర్భాగమని.. కొందరు దీన్ని తమ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా భావించవచ్చని అన్నారు. ఈ హక్కు ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, స్వేచ్ఛ మూలానికి వెళుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. గతంలో స్వలింగ జంటల వివహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజులు పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి.. మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. తాజాగా నేడు తీర్పు వెలువరిస్తోంది.

#supreme-court #same-sex-marriage
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe