NEET UG 2024: నీట్ యూజీ-2024పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. నీట్ పేపర్ల లీకేజీలో ఎలాంటి వ్యవస్థాగత ఉల్లంఘనలు జరగలేదని చెప్పింది. లీకేజీ వ్యవహారం పట్నా, హజారీబాగ్‌లకే పరిమితమైందని పేర్కొంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాలను సుప్రీం ఎత్తి చూపింది. విద్యార్థుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఘటనలను భరించలేమని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహాల ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
Also Read : 15 వేల మందిని తొలగించేందుకు రెడీ అయిన ప్రముఖ టెక్ కంపెనీ!