Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసు.. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ..!

స్కిల్ స్కామ్‌ కేసులో ఏపీమాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీం ఇవాళ తీర్పు వెలువరించనుంది. 371 కోట్ల స్కామ్‌కు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకపోవడంతో రద్దు చేయాలని చంద్రబాబు పిటిషన్‌ వేశారు.

Chandrababu : చంద్రబాబు కేసు విచారణ... చివరిలో ఊహించని ట్విస్ట్!
New Update

Supreme Court To Pronounce Judgment Today On Chandrababu Naidu's Plea To Quash FIR In Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఎఫ్‌ఐఆర్, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ(జనవరి 16)తీర్పును వెలువరించనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, ఎమ్ త్రివేది జనవరి 16న మధ్యాహ్నం 1 గంటలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2023 సెప్టెంబర్ 22 నాటి ఆదేశానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పును వెలువరించనున్నారు. 371 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకపోవడంతో రద్దు చేయాలని చంద్రబాబు పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత, టీడీసీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు ఈ కేసును రాజకీయ ప్రతీకారంగా భావిస్తున్నారు.

గతంలో ఏం జరిగింది?
గతేడాది(2023) అక్టోబరు 17న వేసిన ఈ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసు సీఐడీ తన అరెస్టును సవాలు చేసేందుకు అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ '17ఏ'ని ఉదహరించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలన్న తన పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఇక గతేడాది నవంబర్‌లో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. 371 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో AP-CID నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను అవినీతి నిరోధక చట్టం(పీసీ) కింద నిర్దేశించిన విధంగా పోలీసులు గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి పొందలేదని చంద్రబాబు చెబుతున్నారు.

జులై 26, 2018 నుంచి అమల్లోకి వచ్చిన పీసీ చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం, ప్రభుత్వోద్యోగిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరాదని తాను చేసిన విజ్ఞప్తిని విస్మరించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత నెలలో తన పిటిషన్‌ను తిరస్కరించిందని చంద్రబాబు తన పిటిషన్‌లో వాదించారు. ఈ కేసులో చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ డిసెంబర్ 9, 2021న నమోదైంది. సెప్టెంబర్ 7, 2023న ఈ కేసులో నంబర్ 37 నిందితుడుగా చేర్చారు. సెప్టెంబర్‌ 9న నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్‌ హాల్‌ వద్ద ఆయన్ను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 52రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో గడిపిన చంద్రబాబును అక్టోబర్ 31న(2023) తాత్కాలిక బెయిల్‌పై రిలీజ్‌ చేయగా.. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్ మంజురైంది.

Also Read: యవ్వనంలో గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల సంతానం కలగడం కష్టం అవుతుందా?

WATCH:

#supreme-court #chandrababu-naidu-arrest #ap-skill-development-scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి