CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బిగిస్తున్న ఉచ్చు.. బెయిల్ వస్తే మళ్లీ జైలే!

లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈరోజు విచారించనుంది. ఒకవేళ ఈ కేసులో ఆయనకు బెయిల్ వస్తే అరెస్ట్ చేసే ఆలోచనలో సీబీఐ ఉన్నట్లు సమాచారం.

CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?
New Update

CM Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఈరోజు కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు విచారించారు. జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. ఈరోజు ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

బెయిల్ వస్తే మరోసారి జైలే..

మద్యం ఎక్సైజ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో తన బెయిల్‌పై మధ్యంతర స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)లోని సెక్షన్ 45లోని జాయింట్ కండిషన్స్ నెరవేర్పుపై ట్రయల్ కోర్టు కనీసం సంతృప్తిని నమోదు చేసి ఉండాల్సిందని ట్రయల్ కోర్టు జారీ చేసిన కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఈడీ సమర్పించిన మెటీరియల్ డాక్యుమెంట్లను వెకేషన్ జడ్జి సరిగా పరిగణించలేదని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో ఈరోజు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తే అరెస్ట్ చేసే ఆలోచలనలో సీబీఐ ఉంది.

#cm-kejriwal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe