Supreme Court : నారీ శక్తి అంటూ గొంతులు చించుకుంటారు కదా.. ఇక్కడ చూపించండి మరి!

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమీషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పురుషుల్లాగానే ఆర్మీ, నేవీ , ఎయిర్‌ ఫోర్స్ విభాగాల్లో మహిళలకు పర్మినెంట్‌ కమీషన్‌ లభిస్తున్నప్పుడు కోస్టుగార్డులో మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నారంటూ ప్రశ్నించింది.

Supreme Court : నారీ శక్తి అంటూ గొంతులు చించుకుంటారు కదా.. ఇక్కడ చూపించండి మరి!
New Update

Nari Shakti : నారీ శక్తి(Nari Shakti) అంటూ గొంతులు చించుకునే మీరు మీ ప్రతాపాన్ని ఇక్కడ కూడా చూపించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు  చురకలు అంటించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమీషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పురుషుల్లాగానే ఆర్మీ, నేవీ(Navy) , ఎయిర్‌ ఫోర్స్ (Airforce)  విభాగాల్లో మహిళలకు పర్మినెంట్‌ కమీషన్‌ లభిస్తున్నప్పుడు కోస్టుగార్డులో మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నారంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీం కోర్టు(Supreme Court) గట్టిగా మొట్టికాయలు వేసింది. కోస్ట్‌ గార్డ్ లో అర్హులైన మహిళా షార్ట్ సర్వీస్‌ కమిషన్‌(SSC) అధికారులకు శాశ్వత కమిషన్‌ మంజూరు చేయాలని కోరుతూ మహిళా అధికారిణి ప్రియాంక త్యాగి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు సీరియస్ గా తీసుకుంది.

చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 'మీరంతా మహిళా శక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆ ప్రతాపం ఏదో ఇక్కడ చూపించండి...మహిళల పట్ల న్యాయంగా వ్యవహరించే విధానాన్ని ఇక్కడ కూడా తప్పనిసరిగా తీసుకుని రావాలని పేర్కొంది.

ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ కేంద్రం ఇంకా 'పితృస్వామ్య వైఖరి' అవలంబిస్తోందా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తీర రక్షక దళం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీ(Vikram Jit Banerji) ని ధర్మాసనం ప్రశ్నించింది. కోస్ట్ గార్డ్ లో ఉన్న మహిళల ముఖాలు చూడకూడదు అనుకుంటుందా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

ఇప్పుడు కోస్ట్‌ గార్డు(Coast Guard) తప్పనిసరిగా ఒక విధానాన్ని తీసుకుని రావాలని సుప్రీం కోర్టు పేర్కొంది. నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఉన్నప్పుడు కోస్ట్ గార్డ్‌ కు మాత్రం ఎందుకు శాశ్వత కమిషన్ లేదు అంటూ సుప్రీం ప్రశ్నించింది. మహిళలు సరిహద్దులనే కాపాడుతున్నప్పుడు తీర ప్రాంతాలను ఎందుకు రక్షించుకోలేరు అని సుప్రీం పేర్కొంది. ఆర్మీలో ఉన్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ ను మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు 2020లోనే తీర్పునిచ్చింది.

ఇప్పటికైనా లింగతటస్థ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావాలని పిటిషనర్ తన పిటిషన్‌ లో పేర్కొన్నారు.

Also Read : నేడు సుల్తాన్‌ పూర్‌ కోర్టుకు హాజరు కానున్న రాహుల్‌ గాంధీ!

#supreme-court #air-force #coast-guards #nari-shakti
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe