CM Revanth Reddy: సీఎం రేవంత్ పై సుప్రీంకోర్టు సీరియస్

బీజేపీ మద్దతుతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. బాధ్యత గల స్థానంలో ఉన్న సీఎం కోర్టు తీర్పుపై వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court: రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్
New Update

Supreme Court: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. కవిత బెయిల్ (Kavitha Bail) విషయంలో సీఎం రేవంత్ (CM Revanth Reddy) వ్యాఖ్యలను ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. ఈ రోజు ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తవనకు వచ్చింది. రేవంత్ వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యత గల స్థానంలో ఉన్న సీఎం కోర్టు తీర్పుపై వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పొలిటికల్ కామెంట్స్‌కు తము భయపడమని స్పష్టం చేసింది. మా డ్యూటీ మేం చేస్తామని తెలిపింది.

ఈరోజు ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపర విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ రావడంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే కేవలం 5 నెలల్లో కవితకు బెయిల్ వచ్చిందంటూ వ్యాఖ్యానించారు ఆరోపించారు. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు 16 నెలల తర్వాత బెయిల్ వచ్చిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు గుర్తుచేశారు. కవితకు త్వరగా బెయిల్ రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందని అనుమానం వ్యక్తం చేశారు రేవంత్.

#cm-revanth-reddy #supreme-court #kavitha-bail
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe