Supreme Court: బీహార్ లో వంతెనలు కూలీన ఘటనల పై ప్రభుత్వాన్ని వివరణ కోరిన సుప్రీంకోర్టు!

బీహార్‌లో వరుస వంతెనలు కూలిన ఘటనపై సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, రహదారుల శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.ఇటీవల వరుసగా 10కి పైగా వంతెనలు కూలిన ఘటన పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో నితీశ్ ప్రభుత్వాన్ని సమాధానం కోరతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court: బీహార్ లో వంతెనలు కూలీన ఘటనల పై ప్రభుత్వాన్ని వివరణ కోరిన సుప్రీంకోర్టు!
New Update
Bihar Bridge Collapse: బీహార్‌లో వరుస వంతెనలు కూలిన ఘటనపై సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, రహదారుల శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.ఇటీవల వరుసగా 10కి పైగా వంతెనలు కూలిన ఘటన పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో నితీశ్ ప్రభుత్వాన్ని సమాధానం కోరతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ జనతాదళ్‌-బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక్కడ ఇటీవలి కాలంలో కొత్త, పాత వంతెనలు కూలిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల వరుసగా 10కి పైగా వంతెనలు కూలిపోయాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.

ఈ పిటిషన్ ఈరోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జేపీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. వరుస కూలిపోతున్న వంతెనలకు సంబంధించి సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, రహదారుల శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. వంతెనలు కూలిపోవడానికి కారణం ఏమిటి? దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు.

Also Read: శ్రీశైలం దగ్గర కృష్ణమ్మ పరవళ్లు.. గేట్లు ఎత్తిన అధికారులు!

#latest-news-in-telugu #supreme-court #bihar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe