మనీష్‌ సిసోడియాకు షాక్‌.. బెయిల్‌ కి సుప్రీం కోర్టు నిరాకరణ!

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ ని సుప్రీం కోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ కేసుకి సంబంధించి విచారణను ఆరు నెలలలోపు పూర్తి చేయాలని తెలిపింది. విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని సుప్రీం కోర్టు పేర్కొంది.

New Update
మనీష్‌ సిసోడియాకు షాక్‌.. బెయిల్‌ కి సుప్రీం కోర్టు నిరాకరణ!

Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ పై సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు (Supreme Court) సోమవారం తిరస్కరించింది. సిసోడియా పై సీబీఐ (CBI), ఈడీ (ED) దర్యాప్తు చేస్తున్న కేసుల పై జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి, జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

Also Read: Kerala Bomb Blast: అది తట్టుకోలేకే క్రిస్టియన్ సంస్థపై బాంబు దాడి.. నిందితుడి వీడియో వైరల్ .!

సుప్రీంకోర్టు గతంలో సిసోడియా పై ఉన్న కేసులకు సంబంధించి సీబీఐ, ఈడీలకు పలు ప్రశ్నలు సంధించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీష్‌ ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నారు. ఆయన బెయిల్‌ పిటిషన్‌ పై సుప్రీం కోర్టు అక్టోబర్‌ మొదటి వారంలో వాదనలు వినింది. ఆ తరువాత తీర్పును రిజర్వ్‌ చేసింది.

తన పై రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలని సిసోడియా కోరారు. ఈ క్రమంలో ఇరు పక్షాల తరుఫున వాదనలు విన్న ధర్మాసనం దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించి సిసోడియా (Manish Sisodia) బెయిల్ పిటిషన్‌ ను తిరస్కరించింది.

Also Read: బీఆర్‌ఎస్‌ లోకి కాంగ్రెస్‌ వలసలు!

అయితే సిసోడియా కేసులో విచారణను ఆరు నుంచి ఎనిమిది నెలలోపై పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని సుప్రీంకోర్టు వివరించింది.

Advertisment
తాజా కథనాలు