NEET Counselling: నీట్ కౌన్సిలింగ్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ నీట్ కౌన్సిలింగ్‌పై స్టే మరోసారి సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ కౌన్సిలింగ్‌పై ఎన్టీఏకు నోటీసులు ఇచ్చింది. నీట్‌పై దాఖలైన కొత్త పిటిషన్లను పెండింగ్ పిటిషన్లతో కలిపింది. నీట్‌పై దాఖలైన పిటిషన్లను జులై 8న సుప్రీంకోర్టు విచారించనుంది. By V.J Reddy 21 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి NEET Counselling: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ పేపర్ లీక్ అంశంపై ఈరోజు సుప్రీం కోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది. నీట్ కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై స్టే ఇచ్చేందుకు మరోసారి సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ కౌన్సిలింగ్‌పై ఎన్టీఏకు నోటీసులు ఇచ్చింది. నీట్‌పై దాఖలైన కొత్త పిటిషన్లను పెండింగ్ పిటిషన్లతో కలిపింది. నీట్‌పై దాఖలైన పిటిషన్లను జులై 8న సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీం కోర్టు గరం... నీట్ పేపర్ లీక్ (NEET paper Leak) అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. లీకేజీ ఆరోపణలపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. నీట్ పరీక్ష నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా ఇందుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇంకా పరీక్ష నిర్వహణలో తప్పులు సరిదిద్దాలని సూచించింది. Also Read: ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ కాదు..! మరో బాలీవుడ్ స్టార్ హీరో..? #neet-2024 #neet-counselling మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి