NEET Exam 2024: నీట్ యూజీ పేపర్ లీక్ (Paper Leak) అవకతవకలు జరిగాయని దీనిపై సీబీఐ (CBI) దర్యాప్తు చేయించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.
మళ్లీ పరీక్ష నిర్వహణ..
నీట్ పరీక్ష, ఫలితాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల విడుదలైన నీట్ రిజల్ట్‌లో ఏకంగా 67 మంది ఫ్టస్ట్ ర్యాంకు రావడం అనుమానాలకు దారి తీసింది. దీనిలో ఎనిమిది మందిది ఒకే పరీక్షా కేంద్రం కావడం గమనార్హం. దీంతో పాటూ కొందరు విద్యార్ధులకు అదనపు మార్కులు రావడం లాంటి విషయాలు కూడా కూడా అనుమానాలను రేకెత్తించింది. దీంతో నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో కేంద్రం ఈ పరీక్ష మీద ఒక నిర్ణయం తీసుకుంది. సమయం కోల్పోయి గ్రేస్ మార్కులు పొందిన విద్యార్ధులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 23న మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి జాతీయ పరీక్షల సంస్థ షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. జూన్ 23 ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.20గంటల వరకు పరీక్ష నిర్వహించనుంది. ఇక ఫలితాలను కూడా ఇదే నెలలో విడుదల చేయాలని భావిస్తోంది. జూన్ 30న రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉందని ఎన్‌టీఏ సీనియర్ డైరెక్టర్ తెలిపారు.