Supreme Court: పశ్చిమబెంగాల్‌, కేరళ గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీం కోర్టు నోటీసులు

గవర్నర్‌ వద్ద పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని వెంటనే విడుదల చేసేలా చూడాలని సుప్రీం కోర్టును పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ్రయించాయి. దీనిపై విచారించిన ధర్మాసనం దీనిపై ఇవరణ ఇవ్వాలని ఇరు రాష్ట్రాల గవర్నర్‌ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.

New Update
Supreme Court: పశ్చిమబెంగాల్‌, కేరళ గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీం కోర్టు నోటీసులు

Supreme Court: గవర్నర్‌ వద్ద పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని వెంటనే విడుదల చేసేలా చూడాలని సుప్రీం కోర్టును పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ్రయించాయి. ఏ కారణాలను తెలియజేయకుండానే ఏడాదికి పైగా గవర్నర్లు ఎనిమిది బిల్లులపై కూర్చున్నట్లు రెండు రాష్ట్రాలూ పేర్కొన్నాయి. దీనిపై విచారణ చెప్పట్టింది సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం.. కేంద్ర హోంశాఖ, ఇరు రాష్ట్రాల గవర్నర్‌ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు