Supreme Court : ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణ సమర్థనీయమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని కోర్టు అభిప్రాయపడింది.

Supreme Court : ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
New Update

SC/STs Sub-Classification : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు (Supreme Court) సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని తెలిపింది. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలున్నాయని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ (Chandrachud) నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది.

Also Read : నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు

#supreme-court #sc-sts-sub-classification
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe