Supreme Court: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం..బోయనపల్లి అభిషేక్‌కు బెయిల్ డిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల్లో ఒకరైన బోయినపల్లి అభిషేక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ఐదు వారాల మధ్యంతర బెయిల్‌ను అభిషేక్‌కు ఇచ్చింది కోర్టు. By Manogna alamuru 20 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Delhi liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ముఖ్య పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అభిషేక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ జారీ చేసింది. షరతులతో కూడిన ఐదు వారాల మధ్యంత బెయిల్‌ను ఇచ్చింది. ఈ బెయిల్‌తో పాటూ ట్రయల్ కోర్టు అనుమతి కూడా తీసుకోవాలని...ఆ తర్వాతనే హైదరాబాద్ వెళ్ళాలని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే అభిషేక్ విదేశాలకు వెళ్ళకూడదని..పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. అభిషేక్ భార్యకు హెల్త ప్రాబ్లేమ్స్ ఉండండతో కోర్టు అతనికి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అక్టోబర్ 9, 2022న హైదరాబాద్‌కు చెందిన బోయినపల్లి అభిషేక్‌రావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ నేతలతో సత్సంబందాలున్న అభిషేక్ రావు అరెస్టు కావటం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కాగా.. అంతకు ముందు అరెస్టయిన విజయ్ నాయర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ అధికారులు బోయిన్‌పల్లి అభిషేక్‌రావును హైదరాబాద్ లో అరెస్టు చేసి.. ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌రావు కీలక పాత్ర పోషించినట్టు సీబీఐ విచారణలో తేలింది. సౌతాలాభి పేరుతో అభిషేక్‌రావు లావాదేవీలు కొనసాగించినట్లు గుర్తించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఇండో స్పిరిట్ యజమాని విజయ్ నాయర్, దినేష్ అరోరాతో కలిసి కుంభకోణానికి పథకం రచించినట్లుగా అధికారులు గుర్తించారు. వసూలు చేసిన డబ్బులు రూ.3.80 కోట్లను హవాలా రూపంలో బదిలీలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. సమీర్ మహేంద్రకు అభిషేక్.. హవాలా రూపంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తేలింది. కవిత మరో పిటిషన్.. మరోవైపు డిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో కవిత తరఫున లాయర్లు కోరారు. ఈడీ కస్టడీ నుంచి కవితను తప్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి కేటీఆర్, అడ్వకేట్ వెళ్లి కలిశారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఏడు రోజులు ఈడీ కస్టడీలో కవిత ఉన్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులను కలిసేందుకు ఓకే.. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఏడూ రోజుల ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసింది. తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కవితకు అనుమతినిచ్చింది కోర్టు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. ఇక శనివారం రోజు మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు కవితను కలిసిన విషయం తెలిసిందే. #bail #delhi-piquor-scam #boyinapalli-abhishek మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి