/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-01T164321.365.jpg)
Supreme Court: కోల్‌కతా హత్యాచారఘటనపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మహిళలు, యువ వైద్యుల భద్రతపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన భయానకం. 12 గంటలు ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేశారు?, ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు? ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారు? అని ఫైర్ అయింది. దీనిపై గురువారంలోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐకి ఆదేశం ఇచ్చింది. వైద్యుల రక్షణపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. 10 మంది ప్రముఖ వైద్యులతో కూడిన జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి చోటు దక్కింది. కాగా ఈ కమిటీకి చైర్మన్‌గా వైస్ అడ్మిరల్ డా. ఆర్కే సరైన్ ఉండనున్నారు.
Kolkata's RG Kar Medical College and Hospital rape-murder case | Supreme Court constitutes a National Task Force which includes Surgeon Vice Admiral RK Sarin; Doctor Nageshwar Reddy, Managing Director Asian Institute of National Gastrology among others. pic.twitter.com/9MZRxmKYjs
— ANI (@ANI) August 20, 2024
యువ డాక్టర్లు 36 గంటలు..
మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే.. పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే అని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈరోజుల్లో చాలామంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారని తెలిపింది. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరం అని ధర్మాసనం వెల్లడించింది.