NEET-UG: నీట్ యూజీ పరీక్షపై విచారణ వాయిదా

నీట్ యూజీ పరీక్షపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18న విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది. పేపర్ లీకేజిపై దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సీబీఐ సమర్పించింది. ప్రశ్నాపత్రం లీకేజి విస్తృత స్థాయిలో జరగలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది.

NEET-UG: నీట్ యూజీ పరీక్షపై విచారణ వాయిదా
New Update

NEET-UG: నీట్ యూజీ పేపర్ లీక్ కేసుపై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పేపర్ లీక్ జరగలేదని.. పరీక్ష రద్దు చేయాల్సిన పని లేదని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం విచారించింది. ఈ కేసులో సీల్డ్ కవర్ లో దర్యాప్తు నివేదికను సీబీఐ కోర్టుకు అందించింది. ప్రశ్నాపత్రం లీకేజి విస్తృత స్థాయిలో జరగలేదని కోర్టుకు తెలిపింది. వాదనలి విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. తదుపరి విచారణ, ఆదేశాలు ఆరోజు ఇస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కాగా వచ్చే వారం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని కోర్టుకు కేంద్రం తెలిపింది.

నిన్న, కేంద్ర ప్రభుత్వం NEET-UG 2024 పరీక్షలో ఎలాంటి సామూహిక మాల్‌ప్రాక్టీస్‌ను నిరాకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది . ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ చేసిన డేటా అనలిటిక్స్ ప్రకారం, మార్కుల పంపిణీ బెల్-ఆకారపు వక్రరేఖను అనుసరించిందని, ఇది ఏ పెద్ద-స్థాయి పరీక్షలో కనిపించిందని, ఎటువంటి అసాధారణతలు లేవని సూచిస్తున్నాయని పేర్కొంది.మే 4న టెలిగ్రామ్‌లో లీక్ అయిన నీట్ యూజీ పరీక్ష పేపర్ ఫోటోను చూపించే వీడియో ఫేక్ అని పేర్కొంటూ ఎన్టీఏ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రారంభ లీక్ యొక్క తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించడానికి టైమ్‌స్టాంప్ మార్చబడిందని పిటిషన్ లో తెలిపింది.

#neet-ug-2024-exam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe