CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 23 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CM Kejriwal: సీబీఐ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, బెయిల్ కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఒక పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు మరో వారం గడువు ఇచ్చింది. ఈ క్రమంలో విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. Supreme Court adjourns for September 5 hearing of pleas of Delhi CM Arvind Kejriwal seeking bail and challenging the Delhi High Court order upholding his arrest by the CBI in a corruption case stemming from the alleged excise policy scam. Supreme Court grants one week further… pic.twitter.com/HuAyb1RH98 — ANI (@ANI) August 23, 2024 మధ్యలో మధ్యంతర బెయిల్... లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న అరెస్ట్ అయ్యారు సీఎం కేజ్రీవాల్. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అనుమతి కోరుతూ సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు మే 10న మంజూరు చేసింది. జూన్ 2వ తేదీన తిరిగి జైలులో లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. మద్యంతర బెయిల్ కు సమయం ముగియడంతో కేజ్రీవాల్.. తనకు అనారోగ్యంగా ఉందని.. ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను మరో వార్మ్ రోజులు పొడిగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆయన మధ్యంతర బెయిల్ పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. కాగా జూన్ 2న ఆయన తిరిగి జైలులో లొంగిపోయారు. కాగా ఇటీవల ఈ కేసులో దాదాపు 17 నెలల తరువాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. Also Read : ఓటీటీ లవర్స్ కు షాకిచ్చిన ‘కల్కి’ మేకర్స్.. ఆ సన్నివేశాలు తొలగింపు #cm-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి