Viral Video: 5 ఏళ్ల చిన్నారిని చంపేసిన మూఢ నమ్మకం.. కన్నకొడుకుకే నీటిలో ముంచి హతమర్చిన తల్లిదండ్రులు!

మూఢనమ్మకం హరిద్వార్‌లో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొంది. క్యాన్సర్‌ బారిన పడ్డ పిల్లాడిని రోగాన్ని నయం చేయడం కోసమంటూ గంగనదిలో పదేపదే ముంచారు తల్లిదండ్రులు. దీంతో పిల్లాడు చనిపోయాడు. అయితే చిన్నారిని కుటుంబీకులే కావాలనే నీట ముంచారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

New Update
Viral Video: 5 ఏళ్ల చిన్నారిని చంపేసిన మూఢ నమ్మకం.. కన్నకొడుకుకే నీటిలో ముంచి హతమర్చిన తల్లిదండ్రులు!

Superstition Killed Five Year Baby in Ganga River: నమ్మకాలు, మూఢనమ్మకాలు రెండు వేరువేరు. ఇంగిత జ్ఞానం, కనీస బుద్ధి లేని మనుషులు మన కళ్ల ముందే తిరుగుతుంటారు. మూఢనమ్మకానికి అజ్ఞానమే పునాది.. బూజుబట్టిన భావాలు, చీడబట్టిన నమ్మకాలకు బలైపోతున్న వారి సంఖ్య నేటి రాకెట్‌ యుగంలోనూ కనిపిస్తుండడం బాధాకరం. అయిన వారినే చంపుకుంటున్న ఘోర పరిస్థితులు మనిషి దిగజారుడుతనాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. రోగం వస్తే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలి.. మంత్రగాళ్ల దగ్గరకు కాదు. నమ్మకంతో తాయిత్తు కట్టుకోవచ్చు కానీ.. ఆ తాయిత్తే రోగాన్ని నయం చేస్తుందని భావిస్తే అది ముర్ఖత్వమో, మూఢనమ్మకమో అవుతుంది. ఇదే విషయాన్ని నిజం చేసే ఘటన హరిద్వార్‌(Haridwar)లో జరిగింది. కన్నకొడుకునే తల్లిదండ్రులు హతమార్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


మూఢనమ్మకం.. మూర్ఖత్వం:
అభంశుభం తెలియని వయసులో మహమ్మారి సోకింది.. ఐదేళ్ల పిల్లాడు బ్లడ్ క్యాన్సర్‌ బారిన పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారిని తల్లిదండ్రులు చేజేతులా చంపేశారు. క్యాన్సర్‌ పోవాలంటే గంగలో పిల్లోడిని ముంచాలని ఎవరో బుద్ధి లేని వాడు చెప్పాడు.. తల్లిదండ్రులు ఆ మాటలు విన్నారు.. వీళ్ల బుద్ధి ముందే గంగలో కలిసింది. తర్వాత పిల్లాడి ప్రాణం కలిసింది. అద్భుత నివారణ కోసం ఆశిస్తూ ఐదేళ్ల చిన్నబాబును పదేపదే గంగలో ముంచారు. చివరికు ఆ చిన్నారి ప్రాణం పోయింది. సొంత కుటుంబీకులే పిల్లాడిని హత్య చేశారు. ఈ ఘటన హరిద్వార్‌లోని హర్‌కీ పౌరిలో చోటుచేసుకుంది.


కావాలనే చంపేశారా?
ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం బుధవారం తమ 5 ఏళ్ల చిన్నారితో కలిసి హర్ కీ పౌరీకి వచ్చారు. చిన్నారి తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారు చిన్నారిని గంగానదిలో స్నానానికి తీసుకువెళ్లారు. వారి గుడ్డి నమ్మకంతో, గంగానదిలో పదేపదే ముంచారు. చివరకు ఊపిరి ఆడక ఆ పిల్లాడు మరణించాడు. అయితే ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు కుటుంబీకుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే చిన్నారిని చంపారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు, స్థానికులు మధ్య గొడవ జరిగి అది కాస్త తోపులాటకు దారి తీసింది.

ప్రస్తుతం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీస్ సూపరింటెండెంట్ (సిటీ) స్వతంత్ర కుమార్ సింగ్ ఈ కేసుపై స్పందించారు. హరిద్వార్‌లోని గంగా నదిలో స్నానం చేయడానికి దంపతులు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ కొడుకును తీసుకువచ్చారన్నారు. సర్ గంగారామ్ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించామని, అయితే వైద్యులు బిడ్డను పట్టించుకోలేదని చిన్నారి తల్లిదండ్రులు చెప్పారని పోలీసులు అంటున్నారు.

Also Read: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలివే!
WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు