Rajinikanth: సంక్రాంతి బరిలో సూపర్ స్టార్

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించి పాపులర్ అయింది ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ వచ్చాయి.

Rajinikanth: సంక్రాంతి బరిలో సూపర్ స్టార్
New Update

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించి పాపులర్ అయింది ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ వచ్చాయి. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒక‌టి ‘లాల్ సలాం’. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇందులో ముంబై డాన్‌ మొయిద్దీన్ భాయ్‌గా సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టిస్తుండ‌టం విశేషం. ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతున్నాయి.

ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్నట్లు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌క‌టించింది. దీంతో సంక్రాంతి సీజన్ మరింత హీటెక్కింది. ఇప్పటికే సంక్రాంతికి మహేష్, తేజ సజ్జ, నాగార్జున, విజయ్ దేవరకొండ సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటితో పాటు డబ్బింగ్ మూవీ అయలాన్ కూడా ఉంది. ఇప్పుడు లిస్ట్ లోకి లాల్ సలామ్ చేరింది.

రీసెంట్‌గా జైల‌ర్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన తలైవ‌ర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి అల‌రించ‌నుండ‌టంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లోనూ అంచ‌నాలు పీక్స్‌కు చేరుకున్నాయి. రజనీకాంత్ రాకతో సంక్రాంతి మరింత హీటెక్కింది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

#lyca-productions #lal-salaam #rajinikanth #mumbai-dawn #ee-banner #superstar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe