Ayodhya Ram Temple inauguration: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం అందింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిథులు, బీజేపీ నాయకుడు అర్జునమూర్తి, ఆర్ఎస్ఎస్ ప్రతినిథులు బుధవారం రజనీకాంత్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను రామాలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. గతేడాది ఆగస్టు నెలలో రజనీకాంత్ అయోధ్యలో నిర్మాణ దశలో ఉన్నా రామమందిరాన్ని సందర్శించారు. రామాలయం, హనుమాన్‌గర్హి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అయోధ్యను సందర్శించాలనే తన చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు. అయితే, ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తవడంతో.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఆహ్వానం పంపుతోంది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇందులో భాగంగానే.. ఇవాళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం అందజేశారు.
అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22, 2024న జరగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 'రామ్ లల్లా' ప్రతిష్ఠాపన వేడుకకు ఆహ్వాన పత్రాలను పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రముఖ వ్యక్తులు, మత పెద్దలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సహా దాదాపు 6,000 మంది వ్యక్తులకు ఆహ్వాన లేఖలు పంపనున్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు కూడా ఆలయం ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. 2024 జనవరి మూడో వారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహాన్ని అసలు స్థలంలో ప్రతిష్టించనున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ తెలిపారు.
Also read:
హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు.. ఇదిగో వీడియోలు!