Rajinikanth : బద్రినాథ్ ఆలయంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎందుకో తెలుసా?

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్నారు. ఇందులో భాగంగానే బద్రినాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు రజనీకాంత్. సూపర్ స్టార్ బద్రినాథ్ ను దర్శించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

author-image
By Bhoomi
New Update
Rajinikanth : బద్రినాథ్ ఆలయంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ చిత్రాలు 'గదర్ 2','OMG 2' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం 'జైలర్' కూడా రికార్డులను బద్దలు కొడుతోంది. ఆగస్ట్ 10న విడుదలైన 'జైలర్' భారీ వసూళ్లను రాబట్టింది. ఈ తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం సాయంత్రం బద్రీనాథ్ చేరుకున్నారు, అక్కడ సాయంత్రం పూజలు చేసి స్వర్ణ హారతికి కూడా హాజరయ్యారు. మరోవైపు శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఆయనకు స్వాగతం పలికి ప్రసాదం, తులసి మాలలు అందించింది.

సినిమా విజయాన్ని రజనీకాంత్ అపూర్వంగా జరుపుకుంటున్నారు. బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు-వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అభిమానుల్లో సూపర్‌స్టార్‌పై విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. సాయంత్రం బద్రివిశాల్ స్వామివారి స్వర్ణ హారతిలో కూడా పాల్గొన్నారు. దర్శనం తర్వాత, రజనీకాంత్ ఈ ధామ్‌లోని రావల్ ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రిని కూడా కలిశాడు. రజనీకాంత్ కు సంబంధించిన ఈ వైరల్ వీడియోలో బద్రీనాథ్ ఆలయం వెలుపల కనిపిస్తాడు. రజనీకాంత్ ను చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. 'జైలర్' 900 స్క్రీన్లలో విడుదలైంది. నెల్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రజనీకాంత్ కు జోడిగా తమన్నా భాటియా నటించారు. వీరితోపాటు రమ్యకృష్ణ, యోగి బాబు, వినాయకన్, మోహన్‌లాల్ జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు