Guntur Kaaram: గుంటూరు కారంలో సూపర్ స్టార్ కృష్ట.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు నిజంగా సంక్రాంతే!

New Update
Guntur Kaaram: గుంటూరు కారంలో సూపర్ స్టార్ కృష్ట.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు నిజంగా సంక్రాంతే!

Guntur Kaaram: గుంటూరు కారం.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా రిలీజైన కుర్చీ మడతపెట్టి సాంగ్.. విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇటీవలే నిర్మాత నాగవంశీ ట్రైలర్ రిలీజ్ కు సంబంధించి మరో సూపర్ అప్డేట్ ఇచ్చారు.

Also Read: Anasuya latest photos: ఫ్యామిలీతో కలిసి జిమ్ లో అనసూయ వర్క్ ఔట్స్.. వైరలవుతున్న ఫొటోస్

జనవరి 6 న సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారట. ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నారట. దీంతో మహేష్ బాబు ట్రెండ్ సెట్టర్ గా నిలవనున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సినిమా లాస్ట్ 45 నిముషాలు ఫైట్స్, ఎమోషన్స్, సాంగ్స్ తో అదిరిపోయేలా ఉంటుందని చెప్పుకొచ్చారు నాగవంశీ. ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు.

ఇన్ని ఆసక్తికర విషయాల మధ్య .. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాల్ వైరల్ గా మారింది. సినిమాలో ఇంటర్వెల్ సీన్ లో సూపర్ స్టార్ కృష్ణ కనిపించబోతున్నారు అంటూ టాక్ నడుస్తోంది. ఇక ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు సూపర్ స్టార్ కనిపించడం.. ఫ్యాన్స్ కు పండకే. గతంలో యమదొంగ సినిమాలో ఒక పాటలో సీనియర్ ఎన్టీఆర్ ను కూడా స్పెషల్ ఎఫక్ట్స్ ద్వారా చూపించారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ను ఎలా చూపించబోతున్నారా..? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు

Also Read: BHIMAA: ‘భీమా’ సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. రివీల్ చేసిన గోపీచంద్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు