Rajinikanth: రజనీకాంత్‌కు అరుదైన గౌరవం.. UAE గోల్డెన్‌ వీసా దక్కించుకున్న సూపర్ స్టార్

తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా రజనీకాంత్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

Rajinikanth: రజనీకాంత్‌కు అరుదైన గౌరవం.. UAE గోల్డెన్‌ వీసా దక్కించుకున్న సూపర్ స్టార్
New Update

Rajinikanth Receives UAE Golden Visa: తమిళ అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా UAE (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) ప్రభుత్వం రజనీకాంత్‌కు గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. ఈ సందర్భంగా అబుదాబి ప్రభుత్వానికి, అతని స్నేహితుడు లులు గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ MA యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు సూపర్ స్టార్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

గోల్డెన్ వీసా

ఇన్వెస్టర్స్, శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు, నటులు, సాహిత్యం, క‌ల్చర్‌, ఇలా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తులకు 10 ఏళ్ల కాలపరిమితితో ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది యూఏఈ ప్రభుత్వం. 2009 నుంచి గోల్డెన్ వీసాలను మంజూరు చేయడం స్టార్ట్ చేశారు. ఈ వీసా పొందిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా UAEలో ఎక్కువ కాలం పాటు నివసించే వీలు ఉంటుంది. UAE పౌరులుగా అక్కడి ప్రభుత్వం కల్పించే అన్ని ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Love Me Release Trailer: దెయ్యంతో ప్రేమ కథ..! ఆసక్తికరంగా లవ్ మీ ట్రైలర్ - Rtvlive.com

#rajinikanth #uaes-golden-visa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe